PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది దేవస్థానం అక్రమ విద్యుత్ కనెక్షన్ల పై కొరడా

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది దేవస్థానం వినియోగిస్తున్న అక్రమ విద్యుత్ కనెక్షన్ల పై కొరడా జులిపించినట్లు విశ్వాసనీయ సమాచారం. గత కొంతకాలం నుంచి గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా దేవస్థానం వారు వివిధ చోట్ల విద్యుత్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు విద్యుత్ శాఖ దాడులు నిర్వహించి అక్రమ వినియోగ కనెక్షన్లను సోమవారం తొలగించినట్లు తెలుస్తుంది. దీంతో క్షేత్రంలో విద్యుత్ వినియోగం అక్రమంగా ఎంత కాలం నుండి కొనసాగుతుంది అనేదానిపై కూడా విచారణ చేయనునట్లు సమాచారం. అక్రమ విద్యుత్ వాడకాన్ని సక్రమంగా చేసి వినియోగించుకోవాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు విశ్వాసనీయ సమాచారం . భక్తుల అవసరాల నిమిత్తం త్రాగు కొరకు మరియు కొంత భాగం సాగు నిమిత్తం అక్రమంగా విద్యుత్తు వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించి అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించి సక్రమం చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. ఇది ఆలయ అధికారులకు తెలియజేసి చేస్తున్నారా లేక కిందిస్థాయి సిబ్బంది స్వతంత్రంగా వ్యవహరించి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. అక్రమ విద్యుత్ వినియోగానికి సంబంధించి కనెక్షన్లను తొలగించిన సందర్భంలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది .

About Author