PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహనీయుడు… వీరసావర్కర్​

1 min read

బీజేపీ రాష్ట్ర నాయకులు కగ్గోలు హరీష్​బాబు

పల్లెవెలుగు:స్వాతంత్ర్య పోరాట యోధుడు వీర సావర్కర్​ను స్మరించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు , వీర సావర్కర్​ వాలంటీర్​ ఆర్గనైజేషన్​ అండ్​ సొసైటీ వ్యవస్థాపకులు కగ్గోలు హరీష్​బాబు. వీరసావర్కర్​ 140వ జయంతి సందర్భంగా ఆదివారం BJP HARISH BABU BLOOD DONORS  ఆధ్వర్యంలో “FREE BLOOD GROUP TESTING CAMP” నిర్వహించారు. కార్యక్రమంలో 100 మంది యువకులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వీరసావర్కర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం హరీష్​ బాబు మాట్లాడుతూ బ్రిటిష్​ పాలన నుంచి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేందుకు…వీరసావర్కర్​ తన తోటి విద్యార్థులను ప్రేరేపించి స్వేచ్ఛ కోసం   బ్రిటిష్​ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఫ్రీ ఇండియా సొసైటీని స్థాపించారని గుర్తు చేశారు.  దేశ యువత వీర సావర్కర్​ను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. బ్లడ్​ టెస్టింగ్​ క్యాంపునకు సహకరించిన  రాయలసీమ డయాగ్నోస్టిక్​ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు cv గిరి రాజా వర్మ, గోపాల కృష్ణయ్య , రమేష్ , విక్కై వెంకటేష్, ప్రవీణ్ యాదవ్, హేమలతా రెడ్డి , దరేశ్ గౌడ్ , డా.నాగేంద్ర , ప్రేమ్ కుమార్ , సురేష్ , మహేష్ ,గణేష్ , పవన్ , వెంకటేష్ , భరత్, నవీన్ మరియు వీర సావర్కర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.

About Author