మామిడి రైతులకు మహార్దశ !
1 min readపల్లెవెలుగువెబ్ : మామిడి రైతుల పంట పండింది. తోతాపురి, బేనీషా, మల్లిక, అల్ఫాన్సా తదితర రకాలకు గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. చిత్తూరు జిల్లాలోని రైతులు అధిక శాతం.. మామిడి పంటను సాగు చేస్తున్నారు. సకాలంలో చెట్లకు పూత వచ్చి మంచి దిగుబడి వస్తే అన్ని రకాల కాయలు కలిసి దాదాపు 8 లక్షల నుంచి 9 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుంటుంది. అయితే ఈ ఏడాది వాతావరణ మార్పుల వల్ల నెల రోజులు ఆలస్యంగా చెట్లకు పూత వచ్చింది. దీంతో కోత ఆలస్యమై.. దిగుబడిపై ప్రభావం పడింది. దీనికితోడు మే, జూన్ నెలల్లో కురిసిన వర్షాలు కూడా పంటను దెబ్బతీశాయి.