PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరులో నాయి బ్రాహ్మణ సాధికార సమితి మహాసభ..

1 min read

రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి పెద్దపీట వేసింది నాటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు

రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాగానే బీసీల అభివృద్ధికి కృషి చేస్తా

ఏలూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్

అతి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయి బ్రాహ్మణులు, బీసీలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రం లో బి.సి ల అభివృద్ధి కి బాటలు వేసింసింది ఆనాటి ఆంధ్రుల ఆరాధ్య ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏలూరు పార్లమెంట్ కూటమి ఎం పి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ అన్నారు.ఏలూరులో నాయీబ్రాహ్మణ సాధికార సమితి మహా సభ శుక్రవారం మినీ బైపాస్ లో గ్రాండ్ కృష్ణ పంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ యాదవ్ మాట్లాడుతూ  బి సి లను రాబోయే రోజుల్లో గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు.బి సి ల ఆర్థికాబి వృద్ధికి కృషిచేస్తానని అన్నారు. రాష్ట్రం లో కూటమి అధికారం లోకి వచ్చి చంద్రబాబు సి ఎం గాను ఏలూరు ఎం పి గా తాను అధికారం లోకి రాగానే నాయీ బ్రాహ్మణుల కు ద్వారకాతిరుమలలో కమ్యూనిటీ భవనం నిర్మిస్తానని .ప్రతి నియోజక వర్గం లో కూడా కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తానని పుట్టా మహేష్ యాదవ్ హామీ ఇచ్చారు. జిల్లా నలుమూలల నుండి నాయి బ్రాహ్మణులు ఐక్యతతో వేల సంఖ్యలో ఇలా కూడి రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏలూరు నియోజక వర్గ ఉమ్మడి ఎంఎల్ ఏ అభ్యర్థి బడేటి చంటి. చింతలపూడి ఉమ్మడి ఎంఎల్ ఏ అభ్యర్థి సొంగా రోషన్. చింతలపూడి మాజీ ఎం ఎల్ ఏ ఘంటా మురళి. దెందులూరు మాజీ ఎం ఎల్ ఏ తనయ డాక్టర్ చింతమనేని నవ్య చౌదరి, నాయీబ్రాహ్మణ సంఘ ఏలూరు జిల్లా టి డి పి అధ్యక్షులు కొప్పెర్ల నాగరాజు. తో బాటు జిల్లా నలు మూలలనుండి నాయీ బ్రాహ్మణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ మహాసభలో నాయీ బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి.జిల్లా స్థాయి నాయకులు వై సి పాలనలో నాయీ బ్రాహామణులు రాజ్యాధికారానికి దూరమయ్యారన్నారు. సైకిల్ రావాలి. సైకో పోవాలి అంటూ వై సి పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

About Author