PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ యోగా లింగేశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి కార్యక్రమాలు

1 min read

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

తీర్థప్రసాదాలు స్వీకరించి  మొక్కులు తీర్చుకున్న భక్తులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు నియోజకవర్గం మండలం జోగన్నపాలెం గ్రామంలో బాలా త్రిపుర సుందరి యోగ లింగేశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు 7-3- 2024 శుక్రవారం నుండి  అత్యంత ఘనంగా నిర్వహించబడతాయని కమిటీ చైర్మన్ మరియు దాతలు ఆలూరి వీర నాగ గోవిందరావు మీడియాకు వివరించారు. ఎంతోకాలంగా శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని అదేవిధంగా దాతల మరియు గ్రామస్తుల సహకారంతో గత నెల పున: ప్రతిష్టా కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించామని తెలిపారు. అర్చకులు మాట్లాడుతూ ఈ దేవస్థానంలో పూర్వీకుల నాటి నుండి నేటి వరకు దీప, ధుప, నైవేద్యాలతో అను దినం విరాజిల్లుతుందని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని నిత్యం కొలుస్తూ, అదే విధంగా మహాశివరాత్రి పర్వదిని పురస్కరించుకొని ప్రతి ఏటా అత్యంత ఘనంగా మహోత్సవ కార్యక్రమాలు జరపబడతాయని తెలిపారు. నేడు అర్చనలు, పంచామృత అభిషేకాలు, గణపతి పూజ, మండపారాధన, అఖండ దీపారాధన, లింగారోహన, దీక్షాధారణ, ధ్వజారోహణ మొదలగు కార్యక్రమాలతో స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము, దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించమన్నరు. మహిళలు ఆలయ ప్రాంగణంలో శివనామ స్మరణన్ని భక్తిశ్రద్ధలతో ఆలపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆలయ ప్రసిద్ధిని వివరిస్తూ ఈ ఆలయం 17 వందల సంవత్సరాల క్రితం భూస్థాపితమైనదని,1933 సంవత్సరంలో స్వామివారి దర్శనము జరిగిందని తెలిపారు, గ్రామస్తుల సహకారంతో ఆలయం నిర్మాణం జరిగిందన్నారు. స్వామివారి ప్రత్యేకత వివరిస్తూ స్వామివారి లింగం మీద బ్రహ్మ సూత్రము ఉందని. ఇలా ఉన్న లింగం మీద అభిషేకం చేస్తే స్వామివారికి దాదాపు 1000 సంవత్సరాలు అభిషేకం చేస్తే ఎంత ఫలితమో అదే ఫలితం బ్రహ్మ సూత్రం ఉన్న శివలింగం మీద చేస్తే ఫలితం దక్కుతుందని తెలిపారు. దీదీప్యమానంగా వెలుగుతూ భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా దిన దినం విరాజిల్లుతుందన్నరని అన్నారు.  కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రుద్రపాక చైతన్య శ్రీ సాయి దత్త, ఆలయ దాతలు ఆలూరి వీర నాగ గోవిందరావు, కుందేటి రాము, కార్యనిర్వహణాధికారి మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author