NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదవేగి వేంగీ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు

1 min read

భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

పల్లెవెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి: శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానం వేగి క్షేత్రం పెదవేగి గ్రామంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు 7-3- 2024 శుక్రవారం నుండి 11/3/2024 వరకు అత్యంత ఘనంగా నిర్వహించబడతాయని కమిటీ చైర్మన్ మరియు సభ్యులు  తాత రాంబాబు మీడియాకు వివరించారు. కొన్ని వేల దశాబ్దాల కాలవనాటి ప్రాచీన శిల్పకళా సంపద ఈ దేవస్థానంలో పూర్వీకులు భద్రపరిచారని, నాటి నుండి నేటి వరకు దీప, ధుప, నైవేద్యాలతో అను దినం విరాజిల్లుతుందని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని నిత్యం కొలుస్తూ, అదే విధంగా మహాశివరాత్రి పర్వదిని పురస్కరించుకొని ప్రతి ఏటా అత్యంత ఘనంగా ఐదు రోజులు మహోత్సవ కార్యక్రమాలు జలపడతాయని తెలిపారు. నేడు అర్చనలు, అభిషేకాలు, ఉభయ దాతల చేత గణపతి పూజ, మండపారాధన, అఖండ దీపారాధన, లింగారాహన, దీక్షాధారణ, గోపూజ, ధ్వజారోహణ మొదలగు కార్యక్రమాలతో స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము, రుద్ర హోమము పరిహారణ కార్యక్రమంలు రాత్రి 9 గంటలకు దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడతాయన్నారు.  అనంతరం అన్నదానాన్ని  ఏర్పాటు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ తిప్పాభట్ల సుబ్రహ్మణ్య శర్మ, ఆలయ కార్య నిర్వహణాధికారి కలగర శ్రీనివాసు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author