మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి మండలం లోని జలదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా సోమవారం మహాత్మగాంధీ చిత్రపటానికి డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే కుష్టు వ్యాధి అవగాహన పక్షోత్సవాల దినోత్సవం సందర్భంగా కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజున ఆరోగ్య కార్యకర్తలతో, ఆశలతో, పీహెచ్సీ సిబ్బంది కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ మాట్లాడుతూ గ్రామాలలో 30 తేదీ నుండి ఫిబ్రవరి 13 వ తేదీ వరకు కుష్టు వ్యాధి గురించి సమాజంలో అవగాహన కల్పించి సమాజంలో వున్న అపోహలను, మూఢ నమ్మకాలను పోగొట్టాలని, ఎక్కడైనా వ్యాధి లక్షణాలు కనిపించిన ఎడల వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు పంపించి,తగిన చికిత్స ఇప్పించి కుష్టు రహిత గ్రామాలుగా, కుష్టు రహిత జిల్లాగా ,కుష్టు రహిత రాష్ట్రంగా అలాగే కుష్టు రహిత దేశంగా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఎంపిఎచ్ఓ లు రంగస్వామి, ఎల్ డిసి చంద్రశేఖర్ ,స్టాఫ్నరే సునందాదేవి , ఆరోగ్యకార్యకర్తలు మనెమ్మ, లక్మి నర సమ్మ,ఆశా కార్యకర్తలు, పీ. హెచ్.సి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.