అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే..
1 min read– సామాజిక అసమానతలును ఛేదించిన కాంతి రేఖ పూలే..
– నందికొట్కూరు ఎంఎల్ఏ తొగురు ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతి రావు పూలే అని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. 197 వ జయంతి సందర్భంగా మంగళవారం పట్టణంలోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్థర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడన్నారు. సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా,కాంతి రేఖగా నిలిచారన్నారు. అటువంటి ఉద్యమకర్త, సంఘసేవకుడు, సామాజిక తత్వవేత్త, మహిళా అభ్యుదయ వాది, నిరంతరం మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే ను యువత స్పూర్తిగా తీసుకోవాలన్నారు. పూలే ఆశయాలకనుగుణంగా జగన్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషిచేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడు తోందన్నారు. నందికొట్కూరు పట్టణ పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం గర్వకారణం, హర్షదాయకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ శుకూర్ , జాతీయ బి.సి.సంఘం, నంద్యాల జిల్లా అధ్యక్షులు కురుమూర్తి , మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల.రబ్బాని , మున్సిపల్ కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి , మొల్ల జాకీర్ హుస్సేన్ , దేశెట్టి సుమలత , నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ సగినేల.ఉసేనయ్య , మాజీ కౌన్సిలర్ దేశెట్టి శ్రీనివాసులు , వైసీపీ నాయకులు తమ్మడపల్లి విక్టర్, విశ్రాంత పోలీసు అధికారి పెరుమాళ్ల జాన్, ముజీబ్, ప్రవీణ్, భాస్కర్,యోసేపు , వైసీపీ నాయకులు కార్యకర్తలు బీసీ సంఘం సోదరులు పాల్గొన్నారు.