ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామాజిక సేవలు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి రూరల్ సీఐ మోహన్ రెడ్డి నక్కల మిట్ట శ్రీనివాసులు మల్లెల గ్రూప్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజ్ డాక్టర్ కామళే గణేష్ యస్ ప్రతిభ భారతి అంబేద్కర్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చేసిన సామాజిక సేవ……..పూలే పలికిన మాటల్ని గుర్తుచేశారు ((నా దేహం నశించవచ్చు. కానీ సామాజిక చైతన్యానికి మరణం లేదు. నా మరణానికి దుఃఖించవద్దు, నా ఆశయాల సాధనకై కృషి చేయి అన్న తనమాటలను గుర్తుచేశారు)) 1851 జులై 3న దళిత బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి1859 కాలంలో అనాధల కోసం తొలి అనాధాశ్రమాన్ని ప్రారంభించారు. మహనీయుల త్యాగాల వలన అందించిన తమ సేవలను ప్రతి ఒక్కరు బాధ్యత ప్రజలదగ్గరకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు సామాజిక సేవలో భాగంగా 120 మందికి బీద విధవరాలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు సమావేశానికి వితిమ్మాపురం జాలవాడి కమ్మలదిన్నే హాలహర్వీ కనకవీరుడు కలుగొట్ల ఏనుగబాల గుడికల్లు ఎస్ నాగలాపురం కడివెల్ల తదితర గ్రామాల నుంచి వచ్చిన 300 మందికి బీదలు వృద్ధులు విదవరాల్లకు మంచి భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వివిధ గ్రామాల కమిటీ సభ్యులు సింగనేటి నరసన్న కుమ్మరి నాగరాజు ప్రసాదు మనోహర్ యస్ రాజు అనిల్ పెద్దయ్య తిరుపతన్న వినోద్ కుమార్ దానేల్ మహానంది రాజేష్ తదితరులు పాల్గొన్నారు.