SDPI ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి
1 min read
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: స్థానిక వెలుగోడు పట్టణం లో వేంపెంట సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ని మంగళవారం SDPI ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తరువాత SDPI శ్రీశైలం అసెంబ్లీ కార్యవర్గ సభ్యుడు ఆరిఫ హుస్సేన్ మాట్లాడుతూ వెనుకబడిన,బడుగు,బలహీన వర్గాలకు హక్కులు,మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతి రావు పూలే గారిది అని అన్నారు.. ఈ కార్యక్రమం లో SDPI శ్రీశైలం అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు అమన్, యునుస్,SDPI నాయకులు గౌస్, మొయిన్ లో పాలుగోన్నారు.