NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బహుజనుల విముక్తి ప్రధాత మహాత్మా జ్యోతిరావు పూలే

1 min read

– ఘనంగా పూలే జయంతి వేడుకలు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బహుజన విముక్తి ప్రదాత, బడుగు, బలహీన, పీడిత వర్గాలను బహుజనులు గా సంఘటితం చేసిన సామాజిక న్యాయదర్శినికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. నందికొట్కూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారంమహాత్మా జ్యోతిరావు పూలే 197 జయంతి సందర్భంగా పట్టణంలోని ఆత్మకూరు రోడ్డులోని జ్యోతిరావు పూలే విగ్రహాం దగ్గరా ఆయనను స్మరించుకుంటూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే . వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.మహిళా సాధికారత సాధించేందుకు,సామాజిక అసమానతలు రూపుమాపేందుకు పోరాడిన సామాజిక విప్లవమూర్తి, గొప్పసoఘసంస్కర్త మహాత్మా జ్యోతి రావ్ పూలే అన్నారు.ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగాతీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి.సి.నాయకులు కాళ్ళూరి శివ ప్రసాద్, శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్, చింత విజయ భాస్కర్, కౌన్సిలర్ లు కాటెపోగు చిన్న రాజు, అబ్దుల్ రవూఫ్, లాలు ప్రసాద్, మార్కెట్ రాజు, బాండ్స్ శ్రీను, కురువ శ్రీను, బొట్టు రవి, వి.ఆర్ శ్రీను, బోయ శేఖర్, శాలి భాష, బ్రహ్మయ్య ఆచారి, పి.రమేష్, అల్లంపూర్ లవి తదీతరులు పాల్గొన్నారు.

About Author