PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహేష్ నోటీస్‌

1 min read

సినిమా డెస్క్​ : మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తీ సురేష్ హీరోయిన్. రీసెంట్‌గా మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది. కీలక సన్నివేశాలు తీస్తున్నారు. బ్యాంక్ స్కామ్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. షూటింగ్ మొదలై ఎన్నో రోజులైనా ప్రీ లుక్స్ తప్ప ఇంతవరకూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. పైగా ఇందులో మహేష్ లుక్ కొత్తగా ఉంటుందని చెప్పడంతో, ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్సంతా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బర్త్ డే కావడంతో ఆరోజు ఫస్ట్ లుక్ వస్తుందని ఆశించారు. అయితే ఈలోపే స్వీట్ న్యూస్ చెప్పారు ‘సర్కారు’ టీమ్. ఈనెల 31న ‘ఫస్ట్ నోటీస్’ ఇవ్వబోతున్నామని, ఇంతకు ముందెప్పుడూ కనిపించని న్యూలుక్ లో మహేష్ కనిపిస్తాడని అనౌన్స్ చేశారు. నెలాఖరున ఫస్ట్ లుక్ వస్తోందంటే, మహేష్ బర్త్ డేకి టీజర్ కన్ ఫర్మ్ అని ఆనందపడుతున్నారు అభిమానులు. మహేష్ బాబుతో కలిసి నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

About Author