మహిళా సమాఖ్య 15వ రాష్ట్ర మహాసభ లు జయప్రదం చేయండి
1 min read– ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నవంబర్ 17,18,19 తేదీలలో నంద్యాలలో జరిగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య 15వ రాష్ట్ర మహాసభలలో మహిళా కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబు పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక మిడ్ డే మిల్, హాస్టల్ కార్మికుల తో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా హక్కుల పరిరక్షణకై సమసమాజ స్థాపన కోసం మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఉద్యమాలు కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర మహాసభలు నంద్యాల వేదికగా జరుగుతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ దిశగా ఈ మహాసభ లు జరుగుతాయన్నారు.దేశం లో ప్రభుత్వ పథకాల లో పనిచేస్తున్న లక్షలాది మంది మహిళా కార్మికులు అభద్రత భావంతో, పని చేసే చోట భద్రత లేక వేతనాల పెంపుదల లేక పనిచేస్తున్నారని,దేశంలో నిత్యం రోజురోజుకు మహిళలపై దాడులు అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు. మానవ మృగాల అరాచకాలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఎన్నికల లబ్ధి కోసం మహిళా బిల్లును వాడుకోవడం సిగ్గుచేటు అయిన విషయం అన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్వహిస్తున్నారని ఈ మహాసభల జయప్రదం కై ఇలా కార్మికులకు పాల్గొని విజయవంతం చాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు శ్యామలమ్మ లక్ష్మీదేవి గోపాలమ్మ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.