NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాబూ జగజ్జీవన్ రావు కి నివాళులు అర్పించిన.. మాజిమంత్రి గొల్లపల్లి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ మండలం జూటురు గ్రామంలో భుధ వారం మాజీ ఉప ప్రధాని దివంగత బాబూ జగజీవన్ రామ్ గారి 115 వ జయంతి కార్యక్రమంలో శ్యామ్ కుమార్  గారు ముఖ్య అతిథిగా పాల్గొని జగజ్జీవన్ రామ్ గారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సదర్భంగా  కే.ఈ.శ్యామ్ కుమార్ గారు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్, జవహర్‌లాల్ నెహ్రూ గారి తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడుగా మంత్రి గా బాధ్యతలు చేపట్టారని, భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి గా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించారు. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా నలభై సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని,  మరీ ముఖ్యంగా అతను 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నారని,  ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడింది. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో అతను అందించిన సహకారం, కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన రెండు పదవీకాలాల్లో 1974 కరువు సమయంలో, ఆహార సంక్షోభాన్ని నివారించటానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు అంగీకారం తెలుపటం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలను నిమ్న జాతీయులకు అందే విధంగా కృషి చేసిన మహనీయుడు అని శ్యామ్ కుమార్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో, మాజీ మంత్రి గొల్లపల్లి,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కే.సాంబ శివ రెడ్డి,  అశోక్ కుమార్,ఈశ్వరప్ప,విజయ్ మోహన్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,తిప్పన్న, నరసింహులు, దాదావలి, జుటురు గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

About Author