మెజార్టీ వాదం భారత్ కు ప్రమాదం !
1 min readపల్లెవెలుగువెబ్ : మెజారిటీవాదం భారత భవిష్యత్‌కు అత్యంత ప్రమాదకరమని, దాన్ని అడుగడుగునా ప్రతిఘటించాలని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ‘‘దేశంలో మెజారిటీవాద ట్రెండ్‌తో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరిణామాలన్నీ ఆర్థిక పురోభివృద్ధికి విరుద్ధమైనవే’’నని ఓ వెబినార్‌లో ప్రసంగిస్తూ ఆయన హెచ్చరించారు. విమర్శలకు చట్టపరమైన అవరోధాలను తొలగించడం ద్వారా ప్రభుత్వాన్ని విమర్శలకు మరింతగా స్పందించేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.