NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగ రంగ వైభవంగా …మకరజ్యోతి దర్శనం

1 min read

పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో మకర సంక్రాంతి సంధర్భంగా ఈ సంవత్సరం కూడా మకర జ్యోతి దర్శనం అత్యంత అద్భుతంగా శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమాజం ఆధ్వర్యములో అంగ రంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు.జ్యోతి దర్శనం చూడటానికి వందలాది భక్తులు తరలివచ్చారు.శబరిమలై లో మకరజ్యోతి దర్శనం టైం చూసుకొని అదే విధంగా చాగలమర్రి గ్రామంలో జ్యోతిని వెలిగిస్తారు.జ్యోతి దర్శనం అనంతరం  ఏకశిలా పదునెట్టాంబడి శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు జరిపి భజన కార్యక్రమం అనంతరం పూజారి పవన్ ఆధ్వర్యములో విశేష హారతులు ఇచ్చారు.దీపం వెలిగించే భక్తుడు అనీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా కుటుంబ సమేతంగా విచ్చేసి ఇక్కడ మకర జ్యోతి ని వెలిగిస్తాము అని చెప్పారు.పూజ అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన ఆలయ అధ్యక్షుడు సుంకు జనార్ధన్ రావు , ప్రదాన కార్యదర్శి మధళ్ళపల్లే లక్ష్మీనారాయణ , ఆధవేని సుబ్బారావు , తొమ్మండ్రు పృథ్వినాథ్ , లింగం రంగనాథ్ , శ్రీ ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు , శ్రీ వాసవి యువజన సంఘం కమిటీ సభ్యులు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author