NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా వృద్ధిరేటు 15 శాతం సాధించేలా ప్రణాళిక రూపొందించండి

1 min read

జిల్లా ఇంచార్జి అధికారి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి జె.నివాస్

నంద్యాల, న్యూస్​ నేడు : ఈ ఆర్థిక సంవత్సరం వాస్తవ జిడిపికి అదనంగా 15 శాతం వృద్ధి రేటు సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి…ఆమేరకు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని జిల్లా ఇంచార్జి అధికారి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో  వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల జాతీయోత్పత్తి 15% వృద్ధిరేటుపై జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి జె.నివాస్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం వాస్తవ జిడిపికి అదనంగా 15 శాతం వృద్ధి రేటు సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి…ఆమేరకు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని జిల్లా స్పెషల్ అధికారి జె. నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధికి 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. గత సంవత్సరం జిల్లా గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గా 43,630 కోట్లగా ఉందని… రైతుల ఉపయోగం కోసం నిర్మించిన మల్టీ పర్పస్ ఫెసిలిటీ గోడౌన్ లు కూడా రైతులకు లీజు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని శీతల గోడౌన్ లుగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం ఉద్యాన పంటల విస్తరణతో పాటు సోయాబీన్, పండ్ల తోటల అభివృద్ధి చేస్తే వృద్ధి రేటు శాతం పెంచే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని నాలుగు మండలాలైన దొర్నిపాడు, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండలాల్లో ఒకే పంటకు పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. సాగునీటి కాలువల ద్వారా పారే నీటిని అవసరం లేకున్నా పంటలకు నీరు ఇవ్వడం వల్ల భూమిలో కార్బన్ పరిమాణం తగ్గి ఆల్కనిటీ శాతం పెరగడం వల్ల దిగుబడి తగ్గి రైతులు ఒకే రకం విత్తనం వేసిన పండిన పంటలో వ్యత్యాసం రావడం జరుగుతుందన్నారు. అందుకు భూ సాంద్రతను పెంచడానికి సాయిల్ రేక్లమేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఇంచార్జి అధికారికి వివరించారు. అదే విధంగా జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు స్థలం కేటాయించడం జరిగిందని కానీ నిర్మాణం మాత్రం జరగలేదని జిల్లా స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకొని వచ్చారు. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి  రైతులు  పశుగ్రాస పెంపకంపై దృష్టి సారించాలని ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లాలో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులకు వచ్చే వేతనదారులతో అన్ని ఫార్మ్ పాండ్స్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సమ్మర్ యాక్షన్ ప్లాన్ కు సంబంధించి జిల్లాలో ఉన్న 13 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపుకోవాలన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా ఇంచార్జి అధికారి ఆదేశించారు. నీరు కలుషితం కాకుండా ఎప్పటికపుడు క్లోరిన్ పరీక్షలు నిర్వహించి సంబధిత యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి అర్బన్ ఏరియాలో హెచ్2ఎస్ కిట్ల ద్వారా తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పైప్ లైన్స్ చివర్లో ఎటువంటి లీకేజిలు, నీటి కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *