PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షార్ట్ ఫిలిమ్ తీయండి.. రూ. 10 వేలు గెలుచుకోండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్టీసీని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్న ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ నిర్వ‌హిస్తోంది. షార్ట్‌ ఫిల్మ్‌లు రూపొందించేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మెరుగ్గా ఉన్న వాటి ల్లోంచి ఎంపిక చేసిన మొదటి ఫిల్మ్‌కు రూ.10 వేలు, రెండో ఫిల్మ్‌కు రూ.5 వేలు, మూడో ఫిల్మ్‌కు రూ.రెండున్నర వేలు పురస్కారం ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సురక్షితమైన ప్రయాణం, లీటరు పెట్రోలు ధర కంటే తక్కువ మొత్తంతో రోజంతా నగరంలో సిటీ బస్సుల్లో తిరిగే అవకాశం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్‌ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు వంటి తదితర అంశాలు ఇతివృత్తాలుగా షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించాలని అందులో పేర్కొన్నారు. ఉత్సాహం ఉన్న వారు వివరాలతో ఈనెల 21 లోపు [email protected] చిరునామాకు ఎంట్రీలు పంపాలని సూచించారు.

                                       

About Author