PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి : జిల్లా కలెక్టర్

1 min read

పల్లెవెలుగు  వెబ్  కర్నూలు/ఎమ్మిగనూరు:  ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి ఎమ్మిగనూరులో పర్యటించనున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి రాక సందర్భంగా హెలిప్యాడ్  కోసం ఆదోని బైపాస్ రోడ్ పక్కన , ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ లతో పాటు  వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని  ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.. అనంతరం  ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయలోని సమావేశ మందిరం లో  ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో  ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదిన  రాష్ట్ర ముఖ్యమంత్రి శ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు మండలంలో జగనన్న చేదోడు నాలుగవ విడతకు సంబంధించి నగదు జమ చేయనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు.  ముఖ్యంగా హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి వచ్చే దారిలో గుంతలు లేకుండా ప్యాచ్ వర్క్, స్పీడ్ బ్రేకర్స్ తొలగించడంతో పాటు సభా ప్రాంగణంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను, ఎమ్మిగనూరు మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.  ముఖ్యమంత్రి సభా వేదికకు వచ్చే దారిలో  బస్సుకు ఇబ్బంది లేకుండా ఎలక్ట్రిక్ వైర్లను తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా తాగునీరు,స్నాక్స్ ,భోజన వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.   హెలిప్యాడ్, సభాస్థలి దగ్గర పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్ షో లో   ముఖ్యమంత్రిని కలవాలనుకునే వారిని హెలిప్యాడ్ కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డిపిఓను ఆదేశించారు. . హెలిప్యాడ్, సభాస్థలి కోఆర్డినేట్స్ ను సిద్ధం చేయాలని సర్వే ఏడిని ఆదేశించారు. ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు హార్టికల్చర్ ఏడి, ఐసిడిఎస్ పిడి సభాస్థలి అలంకరణ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను, 4 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఉన్న అంబులెన్సులను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సభాస్థలి దగ్గర డబుల్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని, అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్లను, చెట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ నుంచి ఆదోని మార్గమున రానున్నారని, కావున ముందుగా ఆదోని వైపు లబ్దిదారులను తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో  జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

About Author