PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రావణ మాసఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి

1 min read

– జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఆదోని: శ్రావణమాసం ఉత్సవాలకు భక్తులకు ఏటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పేర్కొన్నారు. శుక్రవారం కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో  క్షేత్ర స్థాయి లో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతతో పాటు బారికేడ్లు, సిసి ఫుటేజ్ కెమెరా ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు అనంతరం ఏర్పాటుచేసిన  కమాండ్ కంట్రోల్ రూమ్ సి.సి ఫుటేజ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ తో పాటు ఆదోని సబ్ కలెక్టర్ పరిశీలించారుఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ…ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 14 వరకు జరిగే శ్రావణమాస ఉత్సవాలకు ఊరుకుందు ఈరన్న స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, విద్యుత్, శానిటేషన్, పార్కింగ్, బారికేడ్లు, బస్సు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. భక్తులకు  మెడికల్ క్యాంపులు నిర్వహించాలని  సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఉత్సవ సమయంలో ఎమ్మార్పీ ధరలు కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఉత్సవాలను విజయవంతంగా చేయాలని అధికారులకు సూచించారు.అంతకుముందు ఊరుకుందు ఈరన్న స్వామి దర్శించుకునేందుకు వచ్చిన జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ , ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వారికి ముందుగా ఆలయ పెద్దలు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ ఊరుకుందు ఈరన్న స్వామి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయం వారు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఆశీర్వాదించారు.ఈ కార్యక్రమానికి డిఎస్పి శ్రీనివాసులు, తాసిల్దార్ రామేశ్వర రెడ్డి, దేవాదాయ శాఖ ఈవో వాణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author