25న చలో ఢిల్లీ విజయవంతం చేయండి
1 min readపల్లెవెలుగు, వెబ్ గొనేగండ్ల: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని,జాతీయ నూతన విద్యవిధానాన్ని రద్దు చేయాలని,దేశంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నవంబర్ 25న ఢిల్లీలో జరిగే చలో పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయాలని గొనెగండ్ల లో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర తాలూక అధ్యక్షుడు ముని స్వామి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్ట ప్రకారం మన రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రంలో ప్రారంభించినప్పటికి నిధులు కేటాయించకపోవడం వలన అవి మొండి గోడలకే పరిమితమయ్యాయి అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మూడు 3,4,5 తరగతులను హై స్కూల్స్ లలో విలీనం చేయడం వలన రవాణా సౌకర్యం లేక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక డ్రాప్ అవుట్ అవుతున్నారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వసతి దీవెన, విద్యా దీవెన, స్కాలర్షిప్ రెయిన్బర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు.విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ తరుణంలో ఉపాధి హక్కులను కల్పించడానికి భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ బిల్లును తీసుకురావడానికి, నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యా కాషాయకరణ,విద్యా ప్రైవేటీకరణకు జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టడానికి ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం నూతన జాతీయ విద్యా విధానం 2020 బిల్లును రద్దు చేయాలని,ప్రతి ఏటా 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెబుతు ఉన్న ఉద్యోగాలనే ఉడగొడుతున్నారని,కావున భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ ను అమలు చేసి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.కావున ఈ సమస్యల పరిష్కరానికై ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల 25 న ఢిల్లీలో జరిగే చలో పార్లమెంట్ మార్చ్ లో విద్యార్థి,యువజన లోకం, పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహా ధర్నా లో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి జలీల్ భాష, హర్ష, కాసింవలి, ముజీఫ్, తదితరులు పాల్గొన్నారు.