NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఛలో సిద్దేశ్వరం కార్యక్రమం విజయవంతం చేయండి..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కృష్ణా నదిపై తీగల వంతెన వద్దు బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనవరి 28 న చేపట్టిన ఛలో సిద్దేశ్వరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు కొండేపోగు చిన్న సుంకన్న ,గూడూరు రవికుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. అనంతరం ఛలో సిద్దేశ్వరం గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉయ్యాల వంతెన వద్దు బ్రిడ్జ్ కం బ్యారేజీ కావాలన్నారు. వంతెన మరియు బ్యారేజీ ఏర్పాటు చేస్తే రాయలసీమ రైతులకు ప్రజలకు త్రాగునీరు సాగునీరు ఏడాది పొడుగునా నీటి కొరత లేకుండా ఉంటుందని రాయలసీమ సస్య శ్యామలమవుతుందని అన్నారు.కరవు సీమ లో వలసలు నివారించవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు శివారెడ్డి, న్యాయవాది మద్దిలేటి, చట్టా మొరళి ,నాగన్న, శివ ,మాస్టర్ ఎం బి రాంబాబు నాయుడు ,ప్రసాద్, ఎలిజా, భాస్కర్ , శ్రీకాంతు ,సురేష్ ,బైరెడ్డి అభిమానులు, బైరెడ్డి శబరి అమ్మ సైన్యం నందికొట్కూరు ప్రజలు యువకులు పాల్గొన్నారు.

About Author