ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి
1 min read
జిల్లా టిడిపి నేతలకు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి విజ్ఞప్తి
కర్నూలు, న్యూస్ నేడు: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొను నిమిత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు ఈ నెల తేది 17-05-2025న శనివారం విచ్చేయుచున్నారనీ, వారి పర్యటన కార్యక్రమాలను విజయవంతం చేయవలసినదిగా ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు, అలాగే బి.జె.పి. జనసేన నాయకులకు, కార్యకర్తలకు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ తో కలిసి ఈ రోజు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం, కర్నూలు నందు ఏర్పాటు చేసిన పత్రికా, మీడియా ప్రతినిధుల సమావేశంలో విజ్ఞప్తిచేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాకు ఇప్పటికే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొని రావడం జరిగిందనీ, జిల్లాపై ప్రత్యేక దృష్టికి కేంద్రీకరించి జిల్లాలో సాగు, త్రాగు నీటి సమస్య, పరిశ్రమల స్థాపనకు వారు ఎనలేని కృషిచేస్తున్నారనీ, ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గములలో అభివృద్ధి సమానంగా చేయాలన్న ఉద్దేశంతో 17వ తేదీన పాణ్యం నియోజకవర్గంలో వారి పర్యటనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారనీ, ఇందులో భాగంగా రైతు బజారు సందర్శన, ప్రజావేధిక సభ ఉంటుందనీ తెలిపారు. ప్రజావేదిక నిర్వహించడం, తద్వారా నిరుపేద కుటుంబాలను వృద్దిలోకి తీసుకొని రావడానికై వారు తలపెట్టిన పి.4, బంగారు కుటుంభం గా మార్చాలన్న ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమమని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారనీ, వారుఅధికారంలో ఉండగా కర్నూలు జిల్లా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదనీ తెలియజేశారు. అందువల్లనే రాష్ట్రంలో వై.యస్.ఆర్.సి.పి.కి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా కూటమి పార్టీలకు 164 సీట్లను గెలిపించి వై.సి.పి.జగన్ కు బుద్ది చెప్పారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికే కొన్నింటిని శ్రీ ఎరా చంద్రబాబునాయుడు అమలు చేశారనీ, వచ్చే జూన్ 12న మరికొన్ని పథకాలు ముఖ్యంగా తల్లికి వందనం కింద చదువుకుంటున్న ప్రతి విధ్యార్థి తల్లి అకౌంటులో ప్రకటించిన మేరకు మొత్తాన్ని జమచేయడం, అలాగే రైతు, రైతుబంద్ పధకాలకు నిధులు విడుదల, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి వాటిని కూడా అమలుచేయబోతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నంద్యాల నాగేంద్ర, యస్. ముంతాజ్, జె.పుల్లయ్య, కె.మహేష్ గౌడ్, సత్రం రామక్రిష్ణుడు, హనుమంతరావుచౌదరి, షేక్షావలి, బెత క్రిష్ణుడు, నందిమధు, మోదలగు వారు పాల్గొన్నారు.