NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం ఎమ్మిగనూరు పర్యటనను విజయవంతం చేయండి

1 min read

– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ నెల 19 వ తేదీన ముఖ్యమంత్రి  ఎమ్మిగనూరు  పర్యటనను విజయవంతం చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.ఆదివారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆదోని సబ్ కలెక్టర్, సంబంధిత అధికారులతో మంత్రి ఏర్పాట్లపై చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి/రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.. హెలిప్యాడ్, బహిరంగ సభకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పరిశీలించారు. సభా ప్రాంగణానికి వచ్చే లబ్ధిదారులకు సరైన సీటింగ్, త్రాగు నీరు, భోజన సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, ఎస్పీ జి.కృష్ణ కాంత్,నగర మేయర్ బివై.రామయ్య, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

About Author