జిల్లాలో డెంగ్యూ మాసోత్సవాలను విజయవంతం చేయండి
1 min read
డ్రైడే-ఫ్రైడే ను పటిష్టంగా అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి
నంద్యాల, న్యూస్ నేడు : జిల్లాలో జూలై 1 నుంచి డెంగ్యూ మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించి డెంగ్యూ నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో డెంగ్యూ మాసోత్సవాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను జెసి, వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో జాతీయ డెంగ్యూ మాస ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించిందన్నారు. ఇందుకు ప్రభుత్వం మూడు పద్ధతులను పాటించాలని సూచించిందని చెప్పారు.. డెంగ్యూను ఓడించడం, నీటిని పరిశీలించడం, శుభ్రం చేయడం, మూతల పెట్టడం తప్పనిసరిగా పాటించాలన్నారు. అలాగే మలేరియా నివారణకు కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2047 విజన్ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని… డెంగ్యూ, మలేరియాలను నివారించి ప్రజల ఆరోగ్య సంరక్షణకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెసి సి.విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.