NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

21న”రైతన్నలతో మన చంద్రన్న”విజయవంతం చేయండి

1 min read

– తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈనెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రైతన్నలతో మన చంద్రన్న” కార్యక్రమం లో భాగంగా అన్నదాతలతో ముఖాముఖి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు, పంటల మద్దతు ధర, ఎరువులు విత్తనాలు వ్యవసాయ యాంత్రికను పరికరాలు రైతుల పరిస్థితి పై అధినేత చంద్రబాబు రైతులతో చర్చిస్తారని పేర్కొన్నారు. అన్నదాతలు అధిక సంఖ్యలో పాల్గొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధినేత దృష్టికి తీసుకురావాలన్నారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు రైతులు పెద్ద ఎత్తున కదిలి రావాలని ఎమ్మెల్యే ఏలూరి పిలుపునిచ్చారు.

About Author