మేడే ను జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మేడే ప్రపంచ కార్మిక వర్గానికి పండుగ రోజని, మరువరాని దినం అని,అంతర్జాతీయ కార్మిక వర్గపు పోరాటపు దినమే మే-డే అని సామ్రాజ్య వాదాన్ని కూల ద్రోయడానికి దోపిడి పీడనల నుండి మానవజాతి విముక్తి చేసి ప్రపంచ సోషలిస్టు విప్లవానికి పునరాంకితమయ్యే రోజు మే-డే సకల దేశాల, జాతుల, మతాల, కులాల కార్మికులంతా ఒకటేనని ఈ ప్రపంచం తమదేనని చాటే అంతర్జాతీయ సమైక్య భావం మే-డే ను జయప్రదం చేయాలని నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక ఇప్ట్ కార్యాలయంలో మేడే గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పి.మజీద్మియా మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు వేలాది సంఖ్యలో పెట్టుబడి దారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్గ కసితో పెద్ద ఊరేగింపు చేసి తమ న్యాయమైన డిమాండ్లను సాధించడానికి పోరాటం చేపట్టారు కార్మికులు తమ వేతనాల పెంపుకై పని వేళలు 12 గంటల నుండి 8 గంటల వరకు తగ్గించడానికి డిమాండ్లతో ఊరేగింపులు పోరాటాలు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టారు.ఈ సందర్భంగా 1886 మేన చికాగో నగరంలో హేమా మార్కెట్ వద్ద కార్మికులు నిర్వహించిన ఊరేగింపు పై ప్రభుత్వం తన సైన్యంతో తుపాకీ గుండ్ల వర్షం కురిపించి ఎందరో కార్మికులను పొట్టన పెట్టుకుంది కార్మికుల రక్తం నుండి పుట్టిందే ఈ ఎర్ర జెండా అని వారు గర్వంగా చెప్పారు. అమెరికా ప్రభుత్వం కార్మికవర్గ పోరాటానికి చైతన్యానికి భయభ్రాంతులకు గురై తమ పెట్టుబడిదారీ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాద పరిస్థితి ఏర్పడిందని భావించి కార్మికుల డిమాండ్లను ఒప్పుకోక తప్పలేదు. ఆనాటి నుండి కార్మికుల పని వేళలు 12 గంటల నుండి ఎనిమిది గంటల వరకు తగ్గించడం జరిగిందన్నారు. ప్రపంచం మొత్తం మీద ఇది అమలు చేయబడిందన్నారు. ప్రతి ఏటా మనకు మేడే రోజున గత కార్మిక వర్గ పోరాటాలను నెమర వేసుకుంటూ భవిష్యత్తు కార్యక్రమాలకు హక్కుల సాధన కోసం సమస్యల పరిష్కారం కోసం పిలుపునివ్వడం జరుగుతుంది మే-డే పిలుపులో భాగంగా కార్మికులు, కార్మిక వర్గ పోరాట స్ఫూర్తితో అమెరికా సామ్రాజ్యవాదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృత పరచాలని ఈ సందర్భంగా ఐఎస్టియు పిలుపునిస్తుంది. అధికారంలోనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులపై తీవ్రంగా దాడి చేస్తూ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలను అమలు చేయడానికి పూనుకున్నాయన్నారు. ఇప్పటికే మన దేశంలో 11 కోట్ల మందికి పైగా నిరుద్యోగులున్నారన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కార్మికుల నిజ వేతనాలు పడిపోయి మరింత దరిద్రులవుతున్నారన్నారు తక్కువ వేతనాలతో అధిక లాభాలు సంపాదించడానికి పారిశ్రామికవేతలు బాల కార్మికుల సంఖ్య పెంచుతున్నారన్నారు కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలి 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చివేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను కాంట్రాక్టికరణ, అవుట్సోర్సింగ్ గా మార్చి వేస్తున్నారన్నారు. నేడు పార్లమెంట్లో బిజెపి అధిక బలం ఉండడంతో ఏకంగా రైల్వే శాఖను, బ్యాంకులను, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి,వంటి ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచారన్నారు. ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ప్రజల వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకుని మతవిద్వేషాలను రెచ్చగొడుతూ ఫాసిస్టు రాజ్యాన్ని సుస్థిరం చేసే ప్రయత్నంలో ఉందన్నారు. బిజెపి అవలంబిస్తున్న కార్పొరేట్ సంస్థల తొత్తు ప్రజావ్యతిరేక విధానాలను ఓడించటం అసాధ్యం అందుకు కార్మికుల ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలుకై పోరాడాలి. కార్మికుల హక్కుల సాధనకై నిరంతరం పోరాటాలే శరణ్యమని.ఇందుకు కార్మికులు సంఘటితంగా ఏర్పడి ఉద్యమించాలని భారత కార్మిక సంఘాల సమైక్య (ఐ ఎఫ్ టి యు) గా పిలుపునిస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పి.మౌలాలి. కోశాధికారి.శిరీష, నవీన్,నీలమ్మ పిడిఎస్ యూ డివిజన్ కార్యదర్శి పి.మర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.