మోడీ కబడ్డీ టోర్నమెంటును విజయవంతం చేయండి
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం మాజీ రాజ్యసభ సభ్యులు బిజెపి రాష్ట్ర నాయకులు టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా మోడీ కబడ్డీ టోర్నమెంట్ పోస్టర్లను విడుదల చేయించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మోడీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కర్నూలు అవుట్ డోర్ స్టేడియం నందు ఈనెల 16,17 తేదీలలో ఈ టోర్నమెంట్ ఉంటుందని యు మోర్చా జిల్లా అధ్యక్షుడు తలారి సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస ఆచారి తెలిపారు.ఈ టోర్నమెంట్ కు పాల్గొనదలచిన వారు.7893744858..8886885260 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టీం పేర్లు నమోదు చేసుకోవాలని వారు తెలిపారు…ఓపెన్ క్యాటగిరి మెన్స్ లో జరిగే పోటీల్లొ మొదటి బహుమతి 20వేల రూపాయలు 2వ బహుమతి 15 వేలు3వ బహుమతి వేలు 4వ బహుమతి 5 వేలు ఉంటుందని,జూనియర్ బాలురు 70 కేజీల లోపు, 18 సంవత్సరాల లోపు వారికి మొదటి బహుమతి 15 వేల రూపాయలు,2వ బహుమతి 8 వేలు,3వ బహుమతి 5 వేలు4వ బహుమతి 3 వేల రూపాయలు ఉంటుందని, ఓపెన్ క్యాటగిరి మహిళల విభాగంలో మొదటి బహుమతి10 వేల రూపాయలు, 2వ బహుమతి 5 వేలు, 3వ బహుమతి 3 వేలు4వ బహుమతి 2వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి గారు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కటికే ప్రసాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘు రాజు అంజి సునీత లోకేష్ సోషల్ మీడియా ఇంచార్జ్ శరత్ తదితరులు పాల్గొన్నారు.