పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంచి మెజారిటీ తో నా తనయుడిని గెలిపించండి
1 min readతన తనయుడు జీవి సుందర్ కుమార్ ని గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకలుగామరి విద్య, వైద్య,ఉద్యోగ,ఉపాధి వంటి సమస్యలపై ప్రశ్నిస్తాడు
మాజీ ఎంపీ జీ.వి హర్ష కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఈ నెల 27 వ తేదీన జరగనున్న పట్ట భద్రుల ఎమ్ ఎల్ సి ఎన్నికలలోకూటమి ప్రభుత్వానికి తమ అభ్యర్ధులను గెలిపించాలని పట్టబద్రులను ఓటు అడిగే అర్హత కూడా లేదని రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు జి వి హర్షకుమార్ తనయుడు పట్ట భద్రుల స్వతంత్ర ఎమ్ ఎల్ సి అభ్యర్థి జి.వి సుందర్ కుమార్ అన్నారు,2024 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి అన్నారు. ఆ నిరుద్యోగ భృతి ఒక్కరికీ కూడా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేసారు, సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టో లో పెట్టీ వాటిని అమలు పరచకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం మోసగించిందని సుందర్ కుమార్ ఆరోపించారు,ఈ కార్యక్రమం లో జి వి సుందర్ కుమార్ తండ్రి జి వీ హర్ష కుమార్ మాట్లాడుతూతూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్ట బద్రుల ఇండిపెండెంట్ ఎమ్ ఎల్ సి అభ్యర్థిగా తన తనయుడు జి.వి సుందర్ కుమార్ పోటీ చేస్తున్నాడని పట్ట బద్రులు విజ్ఞతతో ఆలోచించి తన కుమారుడినీ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్ ఎల్ సి అభ్యర్థిగా మంచి మెజారిటీ తో గెలిపించి శాసన మండలికి పంపించాలని హర్షకుమార్ ఓటున్న ప్రతి పట్ట బద్రుల కు ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తిచేసారు,ఏలూరులో మంగళవారం తన కుమారుడు జి.వి సుందర్ కుమార్ తో బాటు స్థానిక దళిత నాయకులతో కలిసి మంగళవారం హర్ష కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు,ఈ సందర్భం గా హర్ష కుమార్ మాట్లాడుతూతన కుమారుడు జి.వి సుందర్ కుమార్ నీ ఎమ్ ఎల్ సి గా గెలిపిస్తే శాసన మండలిలో హర్ష కుమార్ లా గా ప్రశ్నించే గొంతుకలు మారి విద్యా వైద్య ఉద్యోగ ఉపాధి వంటి సమస్యల పై ప్రశ్నిస్తాడని అన్నారు,అధికార కూటమి ప్రభుత్వం నిలబెట్టే అభ్యర్థులుప్రభుత్వ విధానాలకు అనుకూలంగా ఉంటారని ఇండిపెండెంట్ గా పోటీ చేసే సుందర్ కుమార్ పట్టభద్రుల సమస్యల ను శాసన మండలిలో గొంతెత్తిప్రశ్నిస్తాడ ని హర్షకుమార్ అన్నారు,ఈ సమావేశం లో స్వతంత్ర అభ్యర్థి జి వీ సుందర్ కుమార్ మాట్లాడుతూ తనను ఉభయ గోదావరి జిల్లాల స్వతంత్ర పట్ట భద్రులoతా ఎమ్ ఎల్ సి గా గెలిపిస్తే ఉభయ గోదావరి జిల్లాల పరిదిలో ఉన్న 6 పార్లమెంటు నియోజక వర్గాల లో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు,పట్టభద్రుల కు మెరుగైన ఉద్యోగాలు కల్పించేందుకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంప్లాయ్ మెంట్ ఎక్చెంజి కేంద్రం ఏర్పాటు చేసి శాస్త్ర సాంకేతిక విద్యకు ప్రాధాన్యత కల్పించి విద్యార్థులు విద్యతో బాటు పరిశ్రమల స్థాపించడానికి కావలసిన నైపుణ్యాన్ని అందించే విధంగాట్రైనింగ్ ఇవ్వనున్నామని చెప్పారు,కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు,ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు పరిచే విధంగా ప్రభుత్వం పై వత్తిడి చేస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరైన సమయం లో అందే విధంగా కృషి చేస్తానని,విద్యార్దులకు స్కాలర్ షిప్స్ సక్రమంగా అందడానికి తనవంతు కృషిచేస్తానని ఇది నా ఎన్నికల మేనిఫెస్టో అని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర ఎమ్ ఎల్ సి అభ్యర్థిజి వి సుందర్ కుమార్ మంగళ వారం ప్రెస్ మీట్ వేదికగా తన తండ్రి రాజమండ్రి మాజీ ఎమ్ పి జి వి హర్ష కుమార్ తో ను ఏలూరు కు చెందిన రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయి దళిత నాయకులతోనూ,మేధావులతోనూ కలిసి తన మేనిఫెస్టో ను విడుదల చేసారు,ఈ కార్యక్రమాన్ని మాలమహాసేనా జాతీయ అధ్యక్షులు అలగా రవికుమార్,దళిత నాయకులు ఎరికిపాటి విజయ్,రాష్ట్ర మాజీ ఫారెస్ట్ డైరెక్టర్ పళ్ళెం ప్రసాద్,సరిపల్లి పెదిరాజు తదితరులు పాల్గొన్నారు.