ఆపస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్చి 5 మరియు 6 వ తేదీ లలో నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆఫర్స్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సిహెచ్ శ్రావణ్ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి ఎస్ బాలాజీలు ఓ సంయుక్త ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమాత్యులు శ్రీ ఎల్ మురుగన్ గారు, విద్యాశాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ గారు, విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, ABRSM జాతీయ ప్రతినిధులు గుంతాలక్ష్మణ్ గారు, శివానంద్ గారు, 26 జిల్లాల నుంచి ఆపస్ ప్రతినిధులు హాజరవుతున్నారని ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమం లో విద్యారంగ మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించడం జరుగుతుందని వారు తెలిపారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు, ఆర్థిక బకాయిల విడుదల, ఏకీకృత సర్వీసు రూల్స్ తో అన్ని కేదార్ల ప్రమోషన్లు, అన్ని రకాల యాపుల రద్దు తదితర సమస్యలపై చర్చించడం జరుగుతుందనీ మంత్రులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తామని తెలిపారు.సి.హెచ్. శ్రావణ్ కుమార్ ఎస్ బాలాజీరాష్ట్ర అధ్యక్షులు &ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం.