PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి

1 min read

– సచివాలయం ద్వారా మెరుగైన సేవలు అందించండి
– ఉన్నత విద్యకు పదవ తరగతి తొలి మెట్టు : సబ్ కలెక్టర్
– ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారు
పల్లెవెలుగు వెబ్ ఆదోని : పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆదోని డివిజన్లోని కౌతాళం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల, కోసిగి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, మంత్రాలయం మండలం జిల్లా పరిషత్ పాఠశాల, నందవరం మండలం ప్రభుత్వ పాఠశాల నందు ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… ఆదోని డివిజన్లో ఎమ్మెల్సీ పట్టభద్రులు 19 కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కేంద్రాలు 09, డివిజన్ మొత్తంగా 28 ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల నందు బారి కెడ్లు, పటిష్ట పోలీసు భద్రత, విద్యుత్, లైటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.అనంతరం సబ్ కలెక్టర్ కోసిగి మండలం జుమ్మలదిన్నె గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గ్రామ సచివాలయాల సిబ్బందితో సచివాలయ సర్వీసులను పెంచే సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. పిఎంజెవై కార్డులకు సంబంధించి వాలంటీర్లు అందరీ వివరాలు సేకరించి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కళ్యాణ మస్తుకు సంబంధించిన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్లను బియోండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా చూడాలన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భవతులకు మెరుగు పరిచేలా ఆరోగ్య కార్యకర్త మరియు సంక్షేమ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.కోసిగి మండలం జిల్లా పరిషత్ బాలుర ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులతో సబ్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులు అయ్యేటట్టు ఉపాధ్యాయులు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఉన్నత చదువులకు పదవ తరగతి తొలిమెట్టున్నారు. ఉపాధ్యాయులు నిత్యం విద్యార్థుల ఉన్నతి కోసం కృషి చేస్తూ వారికి మంచి మార్కులు తెప్పించే దిశగా కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులు ఒక్కరూ కూడా ఫెయిల్ కాకుండా చదువుకోవాలన్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారిని చదివిస్తున్నారని వారి తల్లిదండ్రుల కష్టాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకొని ఉన్నత లక్ష్యాలు సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ఏప్రిల్ 3వ తేది నుండి పరీక్షలు ఉన్నందున ప్రతి రోజు రెండు మార్కులు చొప్పున చివరి గ్రేడ్ లో ఉన్న విద్యార్థులు పై గ్రేడ్ లకు వెళ్లేలా ప్రయత్నించాలన్నారు. పదవ తరగతి పాస్ అయిన తరువాత ఎన్నో మార్గాల ద్వారా ఉన్నత చదువులకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు అవసరమైనవన్ని ప్రభుత్వం అందించడంతో పాటు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి అనేది ఉన్నత విద్యకు తొలి మెట్టు లాంటిదని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉపాధ్యాయులు బడిలోని పిల్లలను తమ పిల్లలుగా భావించి వారు ఉన్నత చదువులు చదివేలా వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఈ ఒక్క నెలకు ప్రణాళిక రూపొందించుకొని చదవాలన్నారు. అదే విధంగా సి మరియు డి గ్రేడ్ లలో ఉన్న విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ ను అందించడంతో పాటు గ్రూపుల వారీగా విద్యార్థులను విభజించుకొని వారు తప్పకుండా ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

About Author