స్ట్రాంగ్ రూమ్ లను పటిష్టంగా ఉండేలా ఏర్పాటు చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సాధారణ ఎన్నికల సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ లో స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్ భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజనకర్నూలు, మార్చి, 20 : సాధారణ ఎన్నికలకు సంబంధించిన రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్ లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు.బుధవారం స్థానిక రాయలసీమ యూనివర్సిటీ లో స్ట్రాంగ్ రూమ్స్ ,కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా జిల్లా ఎస్పీ తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన రాయలసీమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్లాక్, లైఫ్ సైన్స్ బ్లాక్, లైబ్రరీ లను పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీలో 8 నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇంజినీరింగ్ బ్లాక్ లో పాణ్యం, కోడుమూరు, ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలు, లైఫ్ సైన్స్ బ్లాక్ లో కర్నూలు, ఆదోని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు కౌంటింగ్ హాల్ లు, లైబ్రరీ బ్లాక్ లో మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో స్ట్రాంగ్ రూములకు సంబంధించి ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ హాలుకు సంబంధించి ఇంకా కొన్ని రూములలో వేస్ట్ మెటీరియల్ ఉందని వాటిని తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ర్యాక్ లు కూడా భద్రతతో కూడిన గదిలో ఏర్పాటు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా కొన్ని గదులు చిన్నగా ఉన్నాయని వాటి మధ్యలో ఉన్న పార్టిషన్ గోడలను తొలగించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, డిటిసి శ్రీధర్, పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, టౌన్ డిఎస్పీ విజయశేఖర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.