46వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు, వెబ్ గొనేగండ్ల:గోనెగండ్లలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు వీరన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రంగప్ప మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యా విధానాల పేరుతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడులో కూడా క్వాలిటీ లేని మెటీరియల్ వాడుతున్నారని క్వాలిటీ లేని మెటీరియల్ వాడడం వల్ల భవిష్యత్ తరాల విద్యార్థుల ప్రాణాలకు అపాయం ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా నూతన విద్యా విధానాన్ని రద్దుచేసి నాడు-నేడు పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చూడాలన్నారు. డిసెంబర్ 2న జరిగే ఎస్ఎఫ్ఐ 46 జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నందికుమార్, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి ఖాజా, సలీం, మరియు అశోక్, మంజునాథ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.