ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కారుమంచి కోరారు. శుక్రవారం స్థానిక చదువుల రామయ్య భవనం లో ఫిబ్రవరి 6 నుండి 9 వరకు జరగబోయే 22వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ, వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కారుమంచి సిపిఐ పత్తికొండ మండల కార్యదర్శి రాజా సాహెబ్ పాల్గొని శ్రీకాకుళంలో జరగబోయే రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరారు. యువకులకు ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించాలని, రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లోఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్లతో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్ర మహాసభలు యువత భవిష్యత్తును నిర్ణయించేందుకు రాష్ట్రమసభలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి యువకుడు చైతన్యవంతుడుగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కే హనుమేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి కే రామంజి, మండల సహాయ కార్యదర్శి ఉపేంద్ర చారి, నజీర్, సిద్ధూ, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.