PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బహుజన రాజ్యాధికార చైతన్య యాత్రను జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఈ నెల ఫిబ్రవరి 15 ,16 తేదీలలో నంద్యాల కర్నూలు జిల్లాలో చేపట్టిన బహుజన రాజ్యాధికార చైతన్య సదస్సును జయప్రదం చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహేంద్ర, జిల్లా ఇన్చార్జి లాజర్ , నందికొట్కూరు అసెంబ్లీ ఇంచార్జ్ ఎల్. స్వాములు తాలూకా అధ్యక్షులు లింగస్వామి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం కాన్షీ రామ్ విగ్రహం సర్కిల్ యందు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ఒక బ్రాహ్మణవాద పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇతర అగ్రకులాల పార్టీగా కమ్మ రెడ్డి కులాల అధిపత్యంలో నడుస్తున్న టిడిపి వైసిపి లాంటి పార్టీలన్నీ మనువాద పార్టీలు 10 శాతమైన లేని ఈ కులాలు గత 75 సంవత్సరాలుగా మన ఓట్లతో అందలమెక్కి అన్ని అవకాశాలను వనరులను అనుభవిస్తున్నారన్నారు .అయితే 85 శాతం ఉన్న మనం కడుతున్న పన్నుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని సంక్షేమం పేరుతో బహుజనులకు పంచి వాళ్ళ సొంత జోబుల్లోనుండి ఇచ్చినట్లుగా తెంపరితనంతో ఈ దగా కోరు పార్టీల నాయకులు మనల్ని మోసగిస్తూ చైతన్యం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు . బాబా సాహెబ్ తన జీవితకాలంమంత పోరాడి మనకోసం రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను నిరాకరిస్తూ ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేయాలనుకుని బిజెపికి కొమ్ముకాస్తు అది తానా అంటే తందానా అంటున్న ఈ వైసీపీ టిడిపి పార్టీల అధికారం ఇంకెన్నాళ్లు పరిశ్రమలు , వ్యవసాయం చివరకు సహజ వనరులను సైతం మిత్రులైన ఆదానీ అంబానీలకు దోచిపెట్టి రైతులు రైతు కూలీలు కార్మికుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నారు. ఉపాధి లేక నిరుద్యోగంతో యువతరం అశాంతితో అల్లాడిపోతున్నారు ఇన్ని సమస్యలతో సతమవుతమవుతున్న బహుజనుల జీవితాల్లో వెలుగు నింపగలిగే శక్తి కేవలం బహుజనుల చే స్థాపించబడిన బహుజన సమాజ్ పార్టీకే ఉందన్నారు. ఈ నేపథ్యంలో 15 ,16 తేదీలలో ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో జరుగు బహుజన రాజ్యాధికార చైతన్య యాత్రను బహుజనులంతా ఏకమై వేలాది మందిగా తరలివచ్చి జయప్రదం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో చిన్న రత్నమయ్య తిరుపాలు నాగరాజు స్వా మన్న బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

About Author