NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కడప ఉక్కు ఏర్పాటుకై ఈనెల 8న బందును విజయవంతం చేయండి

1 min read

– రవికుమార్,రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకై,విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీన జరిగే విద్యాసంస్థల బందుకు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ విభజన హామీల్లో ప్రధానమైనదైన కడప ఉక్కు పరిశ్రమపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేకసార్లు రాయలసీమ ప్రాంతంలో పూర్తిస్ధాయిలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడతామని హామీలు ఇవ్వడం,అట్టహాసంగా కొబ్బరికాయ కొట్టి పునాదిరాళ్లను వేసీ శంకుస్థాపనలు చేయడం మినహా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు మాత్రం చేయకుండా రాయలసీమ ప్రజలను పదే పదే  మోసం చేస్తున్నారని రాయలసీమ ప్రాంతంలో పార్టీలు ప్రజాసంఘాలు రాయలసీమ ఉద్యమసంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో అనేకమార్లు కడప ఉక్కు పరిశ్రమ కొరకు ఉద్యమాలు జరిగాయని అయినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టైనా లేకపోవడం విచారకరమని కడప ఉక్కు పరిశ్రమను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 8న వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బందును విజయవంతం చేసి కడప ఉక్కును సాధించుకోవాల్సిన బాధ్యత ప్రతి రాయలసీమ పౌరుడిపై ఉందని ఆయన అన్నారు.  కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో  శివయోగి,కురువ మధు,మురళీకృష్ణ,పవన్,వెంకటేష్,ఉదయ్,అక్తర్,బాలాజీ,షేక్షా,అఖిల్ గౌడ్,వంశీ,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author