NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బస్సు యాత్రను జయప్రదం చేయండి… 

1 min read

– ప్రచారం నిర్వహించిన సిపిఐ నాయకులు.

పల్లెవెలుగు వెబ్  పత్తికొండ: రాష్ట్రాన్ని రక్షించండి- దేశాన్ని కాపాడండి అంటూ, సిపిఐ తలపెట్టిన బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్ పిలుపునిచ్చారు. సిపిఐ ప్రతినిధి బృందం బుధవారం  పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలక ప్రభుత్వాలను ఇంటికి సాగనంపుదామన్నారు. హంద్రీనీవా ద్వారా పత్తికొండ నియోజకవర్గం లో ఉన్న చెరువులన్నింటికీ నీళ్లు నింపాలన్నారు. పందికోన, క్రిష్ణగిరి రిజర్వాయర్ కింద ఉన్న కుడి, ఎడమ కాలువ స్థిరీకరణ పనులను పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందించాల న్నారు. పత్తికొండలో  టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, పాలిటెక్నిక్ కళాశాల, సీనియర్ సివిల్ కోర్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు అన్నింటిని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2న బస్సు యాత్ర పత్తికొండకు వస్తుందని, పత్తికొండలో జరిగే బస్సు యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు నెట్టికంటయ్య, నాయకులు మాదన్న, నాగరాజు, ఉచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author