PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ రోజు రాష్ట్ర కమిటి పిలుపు మేరకు హోళగుంద ప్రాదమిక  ఆరోగ్య వైద్యాధికారి న్యూట్రన్కి సీఐటీయూ నాయకులు  ఆశావర్కర్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమని ఉద్దేశించి సీఐటీయూ మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ  కనీస వేతనాలు చెల్లించాలని, కమ్యూనిటి హెల్త్ వర్కర్స్ని ఆశాలుగా మార్పుచేయాలి ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్స్, మెటర్నటీ లీవ్స్ అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్, ఇవ్వాలని, పనిభారాన్ని తగ్గించాలని, మొబైల్ వర్స్పై శిక్షణ ఇవ్వాలని, పిహెచ్సికి పిలిపించిన ప్రతి సందర్భంలోనూ టిఎ.డిఎ లు ఇవ్వాలని, రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని, డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 8వ తేదీన విజయవాడ ధర్నాచౌక్ లో జరిగే రాష్ట్ర ధర్నా కార్యక్రమంలో ఆశావర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏపి ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్రకమిటీ (సిఐటియు) పిలుపునిస్తున్నది. 10 వేల వేతనం ఇస్తున్నామనే పేరుతో 24 గంటలు చాకిరీ చేయిస్తున్నారు. ఇతర సిబ్బంది చేయాల్సిన అనేక రకాల పనులు బెదిరించి, వేధించి ఆశాలతో చేయిస్తున్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్వర్క్ లేక, ఫోన్లు పనిచేయకపోయినా ఆశావర్కర్స్ ్న బాధ్యుల్ని చేస్తూ నిందిస్తున్నారు. ఆన్లైన్ వర్క్స్ తో పాటు 26రకాల రికార్డ్స్ కొని వ్రాయాలని హింసిస్తున్నారు.పని ఒత్తిడికి తట్టుకోలేక ఆశావర్కర్స్ తీవ్ర మానసిక ఆందోళనకు గురై అనారోగ్యంపాలై విధి నిర్వహణలో అర్థాంతరంగా అనేకమంది ప్రాణాలు కోల్పొతున్నారు. వీరికి ప్రభుత్వం కనీస నష్టం పరిహారం కూడా చెల్లించడం లేదు. ఏ కారణంతోనైనా ఆశావర్కర్స్ మరణించినా 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రభుత్వ సెలవులతో పాటు మెడికల్ లీవ్స్, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం…వివిధ గ్రామ లో ఆశావర్కర్లు పాల్గొన్నారు.

About Author