‘ హౌసింగ్ గ్రౌండ్ మేళా ’ ను విజయవంతం చేయండి
1 min read– జూమ్ వీసీలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ జి. వీరపాండియన్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 1, 3, 4 తేదీలలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాకు లబ్ధిదారులను సిద్ధం చేయాలని కలెక్టర్ జి వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా పై నియోజకవర్గ స్థాయి నోడల్ ఆఫీసర్ లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ జీ వీరపాండియన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఎన్ మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె బాలాజీ, నియోజకవర్గ స్థాయి నోడల్ ఆఫీసర్ లు, ఆర్ డిఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ జిల్లాలో 98,388 వేల గృహ నిర్మాణాలకు గానూ 46,659 వేల గృహాలకు గ్రౌండింగ్ కావాల్సి ఉందన్నారు. జులై 1, 3, 4 తేదీల్లో అన్ని గృహాలు గ్రౌండింగ్ కావాలని, ప్రతి రోజూ 15,360 వేలకు పైబడి గృహాలు గ్రౌండింగ్ కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో జులై 1 తేదీ 15,360 గృహాలు, 3 తేదీ 15,360 గృహాలు, 4 తేదీ 15,361 గృహాలు గ్రౌండింగ్ చేయాలని అధికారులకు సూచించారు.
వందశాతం గ్రౌండింగ్ అయ్యేలా..చర్యలు.. జేసీ
అనంతరం జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ గ్రౌండ్ మేళాలో 46 వేల 659 గృహాలు గ్రౌండ్ అయ్యేలా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి లేఅవుట్ కు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ నియమించార న్నారు. జూలై నెలలో 1, 3, 4 తేదీలలో హౌసింగ్ గ్రౌండ్ మేళాలో గృహ నిర్మాణాలు 100% గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వాలంటీర్లు యాప్ లో లబ్ధిదారుల ఫోటోలు తీసి వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. లేఅవుట్లలో వాటర్ సప్లై లేకపోతే వెంటనే తాత్కాలిక వాటర్ ట్యాంకర్ లు ఏర్పాటు చేయాలని అధికారులకు జేసీ ఆదేశించారు. అలాగే జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఎన్ మౌర్య మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు హౌసింగ్ గ్రౌండ్ మేళాలో భాగంగా జిల్లాలో 98,388 వేల గృహలు మొదటి దశలో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నామని ఇందులో 13,646 గృహలు గ్రౌండ్ అయ్యాయిని ఇంకా 46,659 ఇళ్లు గ్రౌండ్ కావాలని, జులై 1, 3, 4 తేదీల్లో వంద శాతం గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అంతకుముందు హౌసింగ్ గ్రౌండ్ మేళా హౌసింగ్ ప్రోగ్రాం ప్రణాళిక పై పిపిటి ద్వారా వివరించారు.