NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్తీక వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయండి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు:కార్తీకమాస వనభోజన మహోత్సవం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని టీజీవీ సంస్థల ఛైర్మన్ టి.జి భరత్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరశివారులోని గాయత్రీ గోశాలలో కార్తీక వనభోజనం కార్యక్రమం విధివిధానాలపై సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ నెల 13 వ తేదీన డోన్ రోడ్డులోని గాయత్రీ గోశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూల్లోని అన్ని ఆర్యవైశ్య సంఘాలు, ఆర్యవైశ్య సంస్థలు పాల్గొంటున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్య సోదరీ సోదరీమణులంతా ఒకేవేదికపై పాల్గొని కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వచ్చే ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందని, వచ్చిన వారందరిలో లక్కీ డిప్పు ద్వారా మరికొంతమందికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కర్నూలు నుండి కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా చిన్న అమ్మవారిశాల, గీతా మందిరం, వెంకటరమణకాలనీ వెంకటరమణస్వామి ఆలయం, సీ క్యాంపు టిటిడి కళ్యాణ మండపంతో పాటు కల్లూరు అమ్మవారి శాల నుండి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో 26 సంఘాల అధ్యక్ష్య, కార్యదర్శులు పాల్గొన్నారు.

About Author