9న ఆళ్లగడ్డలో ‘ రా కదలి రా’ కార్యక్రమం విజయవంతం చేయండి
1 min readభారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు హాజరు కావాలి.
టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 9 వ తేదీన జరిగే నంద్యాల పార్లమెంట్ ‘ రా కదలి రా ‘ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు. శనివారం నందికొట్కూరు మండలం లోని అల్లూరు గ్రామంలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నాలుగున్నర ఏళ్లలో వైసిపి అరాచక పాలనకు స్వస్థి పలకాలని, ఈ సైకో పాలన నుండి కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరు కదలి రావాలని ” రా కదలి రా ” కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.వైసిపి పాలనలో బిసిలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ ” జయహో బిసి’తో ప్రజల ముందుకు వచ్చింది. బిసిలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైసిపి ప్రభుత్వంలో 52% ఉన్న బిసిలు, మైనారిటీలు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారని వివరించారు చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోలో మహిళలకు, యువతకు, రైతులకు, బిసిలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందన్నారు . ఈ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఈనెల 9వ తారీఖున ఆళ్లగడ్డలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే ” రా కదలి రా ” కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు గుండం రమణారెడ్డి, ఓబుల్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, జమీల్, నాగలక్ష్మయ్య, రసూల్, జనార్దన్, బ్రహ్మానంద రెడ్డి, మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.