24న జరిగే నిరసన దీక్షను విజయవంతం చేయండి
1 min read– అప్పర్ భద్ర ప్రాజెక్ట్ ను నిలుపుదల చేయాలి
– శ్రీబాగ్ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయాలి
– రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు ఆర్ విఎస్ సీమకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కల్లూరు: రాయలసీమ హక్కులకై కర్నూలు పట్టణంలో జరిగే ఒకరోజు నిరసన దీక్షను విజయవంతం చేయాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు కోరారు.ఈ సందర్భంగా రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు ఆర్ వి ఎస్ సీమకృష్ణ మాట్లాడుతూ సిద్దేశ్వరం సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి బదులు రోడ్డు కం బ్యారేజ్ నిర్మించాలని మరియు అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం నిర్మించడం వలన రాయలసీమకు తుంగభద్ర నది నుండి రావాల్సిన నికర జలాలు హెచ్.ఎల్.సి,ఎల్ఎల్సి మరియు కేసీ కెనాల్ బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు రైతులకు నీళ్లు రావన్నారు.వెంటనే ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయాలని కోరుతూ మరియు శ్రీబాగ్ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసి నీళ్లు,నిధులు, నియామకాల లో న్యాయం చేయాలని కోరుతూ ఈనెల ఏప్రిల్ 24వ తారీఖున కర్నూలు పట్టణంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమంను చేపడుతున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో హరి నాయుడు నాగభూషణం,గోపాల్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.