బహిరంగ సభను జయప్రదం చేయండి..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 15వ తేదీన విజయవాడలో చేపట్టిన మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఉదయం 10 గంటలకు స్థానిక బస్టాండ్ చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్ సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజా రక్షణ భేరి కార్యక్రమాన్ని మూడు దళాలుగా బస్సు యాత్రను ప్రారంభించి అన్ని ప్రాంతాలు తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూప్రజలుఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధం కావాలని తెలియజేస్తూ బస్సు యాత్ర తిరుగుతూ బస్సు యాత్ర ముగింపుగా విజయవాడలో కార్మిక, కర్షక, రైతు, ప్రజా ప్రదర్శన, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగు తున్నది. ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ 30 రకాల ప్రణాళికతోకూడినడిమాండ్స్ ను ప్రవేశపెట్టబోతుంది.కార్మిక, కర్షక,రైతు, ప్రజల సంక్షేమం గురించి పాలించే ప్రభుత్వాలు ఏమి చేయవచ్చు, ఎలా చేయాలి, అని చెబుతూ సిపిఎం ప్రజాప్రణాళికను ప్రవేశపెడుతుంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైయస్సార్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం యుద్ధం ప్రకటించింది.ప్రజలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి రుణాలు మాఫీ చేయాలని, గ్రామీణ ఉపాధి 200రోజులు పని కల్పించి రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని,పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పని కల్పించాలని, అసంఘటిత కార్మికులకు కనీస వేతనం 26,000 ఇచ్చి సమగ్ర సంక్షేమ చట్టం చేయాలి. కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మిట్ చేయాలి. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు, విశాఖఉక్కుపరిరక్షణఅమరావతిలోని రాజధాని ఉండాలని, కరెంటు యూనిట్ రూపాయికే ఇచ్చి పేదలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలి, స్మార్ట్ మీటర్లు పెట్టకుండా ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలి, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 60 రూపాయలకే లీటర్ పెట్రోల్, డీజిల్, ఒక మనిషికి పది కేజీలు బియ్యం చొప్పున, 14 రకాల నిత్యవసర వస్తువులు చౌక దుకాణాల ద్వారా అందించాలి, అందరికీ సంక్షేమం పెన్షన్లు రేషన్ కార్డులు అన్ని రకాల పెన్షన్లు 5వేలకు పెంచాలి. పేద మహిళలకు ప్రత్యేక సహాయం చేయాలి, పేదలకు రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు లోను ఇవ్వాలి, ఖాళీగా ఉన్న రెండు లక్షల 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసి ఓ. పి.యస్ పునరుద్ధరించాలి. మెగా డీఎస్సీ ని నిర్వహించి 40000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగులకు 5000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. సామాజిక న్యాయం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, కులగననా వివక్షపై కఠిన చర్యలు, సబ్ ప్లాన్ అమలు,దళితులకు రక్షణ, జస్టిస్ పున్నయ్య కమిటీ సిఫారసుల అమలు, డప్పు, చర్మకారులు అందరికీ పెన్షన్లుఇవ్వాలి. భూమి కోల్పోయిననిర్వాసితుల పునరావాసానికి ప్రాధాన్యత ఇచ్చి 2013 భూ సేకరణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి. మైనార్టీల హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్లు, మతసామరస్యం, సచార్, రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసుల అమలు చేయాలి. మొదలగు అనేక డిమాండ్స్ తో సిపిఎం పార్టీ పెద్ద పోరాటానికి సిద్ధమయింది.ఈ పోరాటంలో కార్మిక వర్గం ముందు భాగాన నిలిచిపోరాటాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నదని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఉల్లిగయ్య తిమ్మప్ప సలీం రాఘవేంద్ర ఇబ్రహీం ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.