PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయలసీమ ధర్మదీక్షను విజయవంతం చేయండి

1 min read

– కర్నూలులో కృష్ణా నది యాజమాన్య బోర్డు సాధనకై ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి
– 18 న జరుగనున్న రాయలసీమ ధర్మదీక్ష కు ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వనం బొజ్జా దశరథరామిరెడ్డి.
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు వున్న ప్రాంతంలో కృష్ణా నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..గత డెబ్బై సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం వలన రాయలసీమ ప్రాంతానికి నీటి వాటాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందనీ, దీన్ని నివారించాలన్నా, రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమంగా నీరు అందించాలన్నా కర్నూలులో KRMB ని ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. పట్టిసీమ నిర్మాణంతో కృష్ణా డెల్టాకు శ్రీశైలం ప్రాజెక్టుతో అనుబంధం తెగిపోయిందని ఆయన పేర్కొన్నారు. నాగార్జున సాగర్ కు ఎన్ని నీళ్లు ఇవ్వాలో అన్ని నీళ్లను మాత్రమే విద్యుత్చక్తి కి వినియోగించుకోవాలనీ బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేసారు. కేవలం 264 tmc ల నీటిని మాత్రమే సాగర్ కు వదలాలని, మిగిలిన నీటిని రాయలసీమ ప్రాంతంలో నికర జలాలు వున్న ప్రాజెక్టులకు కేటాయించాలని, అంతేకాకుండా రాయలసీమ సాగునీటి సాధన సమితి చేపట్టిన అనేక ఉద్యమాల ఫలితంగా అనుమతులు సాధించుకున్న గాలేరు – నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజక్టులతో పాటు నెల్లూరు, మహబూబ్ నగర్ జిల్లాలకు, మద్రాసుకు త్రాగునీటి సరఫరా సక్రమంగా జరగడానికి ఈ నీటిని నియంత్రణ చేసే వ్యవస్థ శ్రీశైలం రిజర్వాయర్ వున్న కర్నూలులో KRMB ఏర్పాటు తోనే సాద్యమని ఆయన అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం KRMB ని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కాకుండా విశాఖపట్నం లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపడం పట్ల రాయలసీమ రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారనీ ఆయన అన్నారు. దశాబ్దాలుగా సీమ ప్రాంతానికి నీటి వాటాలో జరుగుతున్న అన్యాయం జరుగుతోందనీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. కర్నూలులో KRMB ఏర్పాటు విషయమై రాయలసీమ ప్రాంత ప్రజా ప్రతినిధుల దృష్టకి తీసుకెళ్ళామనీ వారు కూడా ఈ విషయమై ముఖ్యమంత్రి దృష్డికి తీసుకెల్తామని హామీ ఇచ్చారనీ దశరథరామిరెడ్డి తెలిపారు. KRMB కర్నూలులో ఏర్పాటు సాధనకై గత రెండు సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందనీ, కర్నూలులో KRMB ఏర్పాటు ఆవశ్యకత పై సమగ్రంగా వివరిస్తూ ముఖ్యమంత్రికి, ప్రజా ప్రతినిధులందరికీ లేఖలు వ్రాసామనీ అయన తెలిపారు.ఈ నేపథ్యంలో KRMB కర్నూలులో ఏర్పాటు సాధనకై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఈ నెల 18 న నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర రాయలసీమ ధర్మదీక్ష పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామనీ, ఈ ధర్మదీక్ష కు ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తూ ఉత్తరాలు పంపామని ఆయన తెలిపారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ధర్మదీక్ష లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

About Author