NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామాజిక సాధికారిక బస్సు యాత్రను జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  ఈనెల 10వ తేదీన కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాధ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర చెన్నూరు మండలము కొండపేట గ్రామ వంతెన వద్ద జరుగుతున్నదని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తెలిపారు, ఈ సందర్భంగా ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని, మేరువ నాగార్జున ఆదిమూలం సురేష్ ,కారుమూరి నాగేశ్వర రావు సీదిలి అప్పలరాజు , కొలుసు పార్థసారధి , వై.యస్. అవినాష్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ,ఆర్. కృష్ణయ్య , రాజ్యసభ సభ్యులు ప్రముఖ నటులు అలీ , అలాగే పలువురు ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు , ఈ బస్సు యాత్రలో మండల ప్రజలు, వైయస్ఆర్ సీపీ నాయకులు ,కార్యకర్తలు , అభిమానులు అందరూ పాల్గొని జయప్రదము చేయాలని ఆయన కోరారు, ఎస్సీ, ఎస్ టి ,బి సి, ఓ సి మైనారిటీలకు ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాల ద్వారా సమాన ప్రాతిపదికగా అందరికీ లబ్ధి చేకూర్చడం జరిగిందని,మంత్రి పదవులు మొదలుకొని స్థానిక సంస్థల పదవులు వరకు అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆయన అన్నారు, గడిచిన నాలుగున్నర సంవత్సరములలో జగనన్న బీసీలకు పెద్దపీట వేశారని,మైనార్టీలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేశారని, ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,ఓసి మైనార్టీలు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాపతినిధులు వైఎస్ఆర్సిపి అభిమానులు అందరూ కలిసి ఈనెల 10వ తేదీన జరగబోయేటటువంటి చెన్నూరు గ్రామం కొండపేట బ్రిడ్జి వంతెన వద్ద జరుపు సామాజిక సాధికారిక బస్సు యాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నట్లు ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమములో సొసైటీ ప్రసిడెంట్ అల్లి శ్రీరామమూర్తి , తొగట క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ విజయలక్ష్మి , కొండపేట సర్పంచ్ తుంగా చంద్రయాదవ్, బి.సి.నాయకులు దేవరశెట్టి జగన్నాధం,శంకవరం నరసయ్య, బి.సి.నాయకులు, గిద్దలూరు రామాంజనేయులు, నాయీ బ్రాహ్మన నాయకులునిత్య పూజయ్య, బి.సి. నాయకులు బొలా వెంకట సుబ్బయ్య , శేఖర్, రాచినాయపల్లి, డా.పిచ్చయ్య , కొండపేట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author