NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ టి యు వజ్రోత్సవాలను విజయవంతం చేయండి                 

1 min read

యస్.టి. యు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పిలుపు   

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(యస్.టి. యు )ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 12 ,13 తేదీలలో కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు జరుపబోవు వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఎస్. టి .యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా శుక్రవారము ఎస్ టి యు వజ్రోత్సవ వేడుకల గోడపత్రికను పత్తికొండ స్థానిక శాంతి టాలెంట్ స్కూల్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యారంగ సేవలో నిర్విరామ కృషి చేస్తూ ఉపాధ్యాయ వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం తన వంతు పాత్ర పోషిస్తూ ఉపాధ్యాయ వర్గంలో ఒక ఉన్నత సంఘంగా కొనసాగుతూ ఉన్నదని తెలిపారు. ఈరోజు ఉపాధ్యాయ వర్గం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని వాటి పరిష్కారం కోసం సమిష్టిగా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు. భవిష్యత్తులో వచ్చేది ఉద్యమ కాలమేనని, సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఉపాధ్యాయుడు  తమ వంతు కృషి చేయాలని విన్నవించారు.ఈ  కార్యక్రమంలో     ఎస్ టి యు  జిల్లా అధ్యక్షుడు గోకారి , ప్రధాన కార్యదర్శి జనార్ధన్, ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి , ఎస్ టి యు .రాష్ట్ర కౌన్సిలర్స్ కుంపటి నారాయణ,కొత్తపల్లి సత్యనారాయణ,పత్తికొండ మండల అధ్యక్ష కార్యదర్శులు బలరాం,చంద్ర శేఖర్,ఆర్థిక కార్యదర్శి మారుతి వెంకటేశ్వర్లు,  తదితరులు పాల్గొన్నారు.

About Author