సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
1 min read
నగర కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష
పల్లెవెలుగు కర్నూలు: సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిలాని భాష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని వాటిని వెంటనే అమలు చేయాలని కోరుచూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు రేపు 18.2.2025వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్లేట్లు గరిటలతో శబ్దం చేస్తూ నిరసన కార్యక్రమం జరుగునని ఈ కార్యక్రమమునకు అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, అనుబంధ సంస్థల నాయకులు, సిటీ కాంగ్రెస్ కమిటీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనవలసిందిగా జిలాని భాష పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు , ఐఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, మైనార్టీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్ కాంగ్రెస్ నాయకులు కే వెంకటరెడ్డి, షేక్ రియాజుద్దీన్, ఖాద్రి పాషా, అనంతరత్నం మాదిగ, ఈ లాజరస్, ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, ఆర్ ప్రతాప్ వశీభాష, మా భాష, అభి నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు.