ఎండ్రకాయలతో బ్యాటరీలు తయారీ !
1 min readపల్లెవెలుగువెబ్ : అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ విశిష్ట పరిశోధన చేపట్టారు. లోబ్ స్టర్లు, ఎండ్రకాయల వంటి సముద్ర జీవుల డిప్పల నుంచి సుస్థిర శక్తినిచ్చే బ్యాటరీలను అభివృద్ధి చేశారు. ఎండ్రకాయలపై ఉండే డిప్పల్లో ఓ రసాయన పదార్థాన్ని పరిశోధకులు గుర్తించారు. శక్తిని నిల్వచేయడంలో ఈ రసాయనం అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నట్టు వెల్లడైంది. ఈ రసాయన పదార్థం పేరు చిటిన్. ఎండ్రకాయలు, రొయ్యలు వంటి క్రస్టేషియన్ జీవుల బాహ్య శరీర నిర్మాణంలో ఉండే కర్పరాలు ఈ చిటిన్ తోనే తయారవుతాయి. చిటిన్ సాయంతో ఈ పై డిప్పలు ఎంతో గట్టిగా రూపొందుతాయి. ఇప్పుడీ చిటిన్ ను బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.