‘ కోవిడ్’ నియంత్రణకు.. ‘మల్బార్’ కీలక నిర్ణయం..
1 min read– లక్ష మందికి ఉచితంగా టీకీ అందిస్తామని ప్రకటించిన యాజమాన్యం
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన మహమ్మారిని తరిమికొట్టేందుకు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ముందుకొచ్చింది. 10 దేశాల్లో 260 షోరూములలో విస్తరించిన మలబార్ సంస్థ … కోవిడ్ నియంత్రణకు తమదైన శైలిలో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దాదాపు లక్ష కోవిడ్ వ్యాక్సినేషన్లు ఉచితంగా ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఆభణాలచేతి వృత్తిదారులు, పెట్టుబడి దారులు, ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి కాకుండా… వ్యాక్సిన్ అందుబాటులో లేని వారు, వ్యాధి బారిన పడే అవకాశం ఉన్న వారికి టీకాలు పంపిణీ చేస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది. టీకా పంపిణీ కార్యక్రమాన్ని తీవ్రతరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా .. తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు షోరూం హెడ్ ఫయాజ్, మార్కెటింగ్ మేనేజర్ నూర్వుల్లా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.