వైయస్సార్ సిపి పార్టీ నష్టపోతుంది మాల మహానాడు అధ్యక్షుడు
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలానికి చెందిన రాష్ట్ర మాల మహానాడు మరియు అనుబంధ అధ్యక్షులు డాక్టర్ సేవ నాగ జగన్ బాబురావు, రాష్ట్ర మాదిగ దండోరా ఉపాధ్యక్షులు ఏసుపోగు డానియల్ ,శుక్రవారం విజయవాడలో పార్లమెంట్ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ని ఆయన చాంబర్లో కలిసినామని ఓ ప్రకటన తెలియజేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గం లో దూలం నాగేశ్వరరావు ఆయన కుమారుల వల్ల వైఎస్ఆర్ పార్టీ, నష్టపోతుందని, కైకలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఎస్సీ, ఎస్టీ ,బీసీ, ముస్లిం మైనారిటీ మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం జరుగుతుందని, కైకలూరు నియోజకవర్గంలో వీళ్ళ పట్ల వైఎస్ఆర్ పార్టీ చాలా నష్టపోతుందని మిధున రెడ్డికి విన్నిగించుకోవడం జరిగిందని, ఆయన అన్నారు. మిథున్ రెడ్డి మాకు హామీ ఇచ్చినారని, మీకు పార్టీ వాళ్లకి జరిగినటువంటి అన్యాయంపై ఎంక్వయిరీ చేస్తామని ,మీకు మన పార్టీ వాళ్లకు న్యాయం జరుగుతుందని ,మళ్లీ మన పార్టీని గెలిపించాలని జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం పని చేయమని, సూచించారని ఆయన అన్నారని అన్నారు. తదనానంతరం డేనియల్ మాట్లాడుతూ దూలం నాగేశ్వరరావు, ఆయన కుమారులు అక్రమ సంపాదన సంపాదించుకుంటూ మాల మాదిగల మీద, వైయస్సార్ పార్టీ అభిమానుల మీద, తప్పుడు కేసులు పెట్టి నటు వంటి వారికి తగు గుణపాఠం చెబుతామని, దానియేలు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కుల విజయకుమార్, కైకలూరు నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు అందుగుల ప్రతాప్ కుమార్, దెందులూరు నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు కోటి సోమేశ్వరరావు, చీలి లావణ్య, మహిత అందుగుల, దాసరి మణి, అద్దంకి కృష్ణ ,గరికి ముక్కుల రాజేష్ ,గూట్ల పౌలు ,తాడంకి వరదానం, తదితరులు పాల్గొన్నారు.